
పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా చేస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం ఎదురుచూపులు చూసి చూసి అలిసిపోయిన అభిమానులకు ఊరట కలిగిస్తూ మెల్లగా ఒక్కో పాట విడుదల చేస్తున్నారు. ఈ సినిమా నుంచి కొల్లగొట్టినాదిరో.. అంటూ సాగే రెండో పాట సోమవారం విడుదల చేశారు.
చంద్రబోస్ వ్రాసిన ఈ పాటని ఎంఎం కీరవాణి అలనాటి పాత మధురాలు గుర్తుకు తెచ్చేవిదంగా అద్భుతంగా స్వరపరిచి చక్కటి సంగీతం అందించగా మంగ్లీ, రాహుల్ సిప్లీ గంజ్, రమ్య బెహరా, యామినీ ఘంటసాల కలిసి చాలా హుషారుగా పాడారు.
ఈ సినిమాలో బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, జాక్విలిన్ ఫెర్నాండస్, అర్జున్ రాంపాల్, ఇంకా విక్రమ్ జీత్, జిష్ణుసేన్ గుప్తా, నోరాహి ఫతేహి, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, పూజిత పొన్నాడ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: క్రిష్, సంగీతం: ఎంఎం కీరవాణి, పాటలు: స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, కెమెరా: జ్ఞానశేఖర్, ఎడిటింగ్: శ్రవణ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, శామ్ కౌశల్, దిలీప్ సుబ్బరాయన్.
హరిహర వీరమల్లులో క్రిష్ పూర్తిచేయగా మిగిలిన సన్నివేశాలను జ్యోతీ కృష్ణ దర్శకత్వంలో పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యాననర్లో ఏఎం రత్నం రూ.150 కోట్ల భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. మార్చి 28న హరిహర వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.