
ఒకప్పుడు తన సినిమా సక్సెస్ లతో బాక్సాఫీస్ ను షేక్ ఆడించడమే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను సైతం తిరగరాసిన డైరక్టర్ పూరి జగన్నాథ్ ఈ మధ్య పూర్తిగా ట్రాక్ తప్పేశాడు. పూరి రేంజ్ సినిమాలు ఎలా ఉంటాయో అందరికి తెలుసు కాని ఆ అంచనాలు అందుకోవడంలో తను విఫలమవుతున్నాడు. టెంపర్ తర్వాత మూడు సినిమాలు తీసినా ఒకే రిజల్ట్ అదే ఫ్లాప్.. అయితే ఈ టైంలో పూరితో సినిమా అంటే భయపడుతున్నారు స్టార్ హీరోలు.
ఇజం హిట్ ఐతే తారక్ తో సినిమా ఉండేది అది క్యాన్సిల్ అయ్యింది ప్రస్తుతం కుర్ర హీరోలకు కథ సిద్ధం చేసుకుంట్టున్న పూరికి ఓ అద్భుతమైన మల్టీస్టారర్ కథ తట్టిందట. ఇక అందులో హీరోలుగా ఎన్టీఆర్, అల్లు అర్జున్ అయితే బాగుంటుందని పూరి అభిప్రాయపడుతున్నాడు. తారక్ సినిమాకే డౌట్ అన్న పూరి ఇప్పుడు బన్నిని కలిపి మల్టీస్టారర్ తీయడం అంటే కాస్త కష్టమే. బన్నికి దేశముదురు, ఇద్దరమ్మాయిలతో లాంటి కిక్ హిట్ అందించిన పూరి టాలెంట్ ఏంటో తెలుసు. మరి ఈ న్యూస్ నిజమైతే కనుక మెగా నందమూరి ఫ్యాన్స్ పండుగ చేసుకోవడం ఖాయం.