
నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో సందీప్ కిషన్, రీతువర్మ జంటగా నటించిన ‘మజాకా’ ట్రైలర్ వచ్చేసింది. రెండున్నర నిమిషాల ట్రైలర్లో వరుసపెట్టి పంచ్ డైలాగ్గులు, కామెడీ, ఫైట్ సీన్లు చూస్తే ట్రైలరా మజాకా అనిపిస్తుంది. ట్రైలర్లో రావు రమేష్ డైలాగ్స్, కామెడీ టైమింగ్తో ఆదరగొట్టేశారు.
మజాకాలో రావు రమేష్, అనుషు, మురళీ శర్మ, రఘు బాబు, అజయ్, శ్రీనివాస్ రెడ్డి, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, ముఖ్యపాత్రలు చేశారు. అంటే 100 శాతం వినోదం గ్యారెంటీ ఇచ్చిన్నట్లే. ట్రైలర్లో చూపిన్నట్లుగానే సినిమాలో కామెడీ పండించగలిగితే ఈ ఏడాది విడుదలయిన సూపర్ హిట్ కొట్టిన సినిమాల జాబితాలో మజాకా కూడా చేరుతుంది.
ఈ సినిమాకు సంగీతం లియోన్ జేమ్స్, కెమెరా: నిజర్ షఫీ, ఎడిటింగ్: చోట కె ప్రసాద్ చేశారు.
ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై రాజేష్ దండ, బాలాజీ గుట్ట, ప్రసన్న కుమార్ బెజవాడ కలిసి నిర్మించిన మజాకా ఫిబ్రవరి 26న విడుదల కాబోతోంది.