
వికీ కౌశల్, రష్మిక మందన ప్రధాన పాత్రలలో లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన హిందీ సినిమా ‘చావా’పై తొలుత విమర్శలు వచ్చినప్పటికీ సూపర్ హిట్ అయ్యింది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవితగాధ ఆధారంగా పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో ఈ సినిమా విడుదల చేయగా అన్ని భాషలలొ సూపర్ హిట్ అయ్యింది. కలెక్షన్స్ కనకవర్షం కురిపిస్తోంది.
సినిమా విడుదలకు ముందు అభ్యంతరాలు చెప్పినవారే ఇప్పుడు చావా మహాద్భుతంగా ఉందని పొగుడుతున్నారంటే ఈ సినిమా ఏ స్థాయిలో హిట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు.
ఈ సినిమాలో అత్యంత క్లిష్టమైన సన్నివేశం బుర్హాన్ పూర్ కోటపై మారాఠా యోధులు దాడి చేయడం. సుమారు ఏడు వందలమంది, 150 గుర్రాలతో యుద్ధ సన్నివేశం చిత్రీకరించారు. సినీ నిర్మాణ సంస్థ ఆ మేకింగ్ వీడియో విడుదల చేసింది. అది చూసినప్పుడు ఈ సినిమా తీయడానికి ఎంతగా శ్రమించారో అర్దమవుతుంది.
ఈ సినిమాలో వికీ కౌశల్, రష్మిక మందన, అక్షయ్ కుమార్, అశుతోష్ రాణా, సంతోష్ జువెకర్, దివ్య దత్త, వినీత్ కుమార్ సింగ్, డయానా పెంటి తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
మాడ్ డాక్ ఫిలిమ్స్ సమర్పణలో దినేష్ విజన్ ఈ సినిమా నిర్మించారు.