సంక్రాంతికి వస్తున్నాం.. జీ5 ముహూర్తం ఫిక్స్

ఈసారి సంక్రాంతికి పండుగకు విడుదలైన మూడు పెద్ద సినిమాలలో జనవరి 14 న విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ అయ్యింది. కనుక ఆ సినిమా కోసం ఫిబ్రవరి 14 నుంచి ఓటీటీ ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తూనే ఉన్నారు.

ఇదిగో అదిగో అంటూనే ఫిబ్రవరి నెలంతా లాగించేస్తున్నారు కానీ ఇంతవరకు విడుదల చేయకపోవడంతో ఓటీటీ ప్రేక్షకులు అసహనంగా ఉన్నారు. కనుక ఇక ఈ సినిమాని ఓటీటీలోకి దించేస్తున్నారు. 

మార్చి 1వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి జీ5 ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం ప్రసారం అవుతుందని, ఆ సంస్థ స్వయంగా నేడు ప్రకటించింది. కనుక మరో 8 రోజులు ఓపిక పడితే సంక్రాంతికి వస్తున్నాం బ్యాచ్ మన ముందుకు వచ్చేస్తుంది. 

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ తీసిన ఈ సినిమా నిజంగానే ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించడంతో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో వెంకటేష్, మీనాక్షీ చౌదరి, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలలో నటించారు.