
మెగా హీరో రాం చరణ్ ప్రస్తుతం నటిస్తున్న ధ్రువ సినిమా రిలీజ్ విషాంలో క్లారిటీ వచ్చింది. ముందు డిసెంబర్ 2న రిలీజ్ అని హడావిడి చేసిన చిత్రయూనిట్ ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసింది. డిసెంబర్ 9న ధ్రువ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తమిళ సూపర్ హిట్ మూవీ తని ఒరువన్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ క్రమంలో సినిమా తెలుగులో కూడా అంచనలాను అందుకునేలా చెర్రి జాగ్రత్త పడుతున్నాడు.
పెద్ద నోట్ల ఎఫెక్ట్ వల్ల సినిమాలకు కాస్త షాక్ తగిలింది. అందుకే సినిమాల రిలీజ్ డేట్ విషయంలో మార్పులు జరుగుతున్నాయి. ఇక సినిమా రిలీజ్ కు ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తానని ఎనౌన్స్ చేసిన చిత్రయూనిట్ ఆ ఏర్పాట్లలో ఉన్నారు. చెర్రి వెనుకడుగు వేయడానికి కేవలం పెద్ద నోట్ల రద్దు కారణమేనా లేక మరేదైనా అయ్యి ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది.
రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ మ్యూజిక్ అందిస్తుండగా సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. బడ్జెట్ విషయంలో అసలు సినిమాకు ఏమాత్రం తగ్గకుండా చేసిన ఈ ధ్రువ కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నారు.