మజాకాలో సొమ్మసిల్లి పోతున్నావే..

నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్, రీతువర్మ జంటగా నటించిన ‘మజాకా’ ఫిబ్రవరి 26న విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్‌ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా సొమ్మసిల్లి పోతున్నావే అంటూ సాగే జానపద గీతాన్ని విడుదల చేశారు. 

రాము రాథోడ్, ప్రసన్న కుమార్‌ బెజవాడ కలిసి వ్రాసిన ఈ పాటని సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్ చకాగా స్వరపరిచిన ఈ పాటని రేవంత్ చాలా చక్కగా పాడారు.   

మజాకాలో రావు రమేష్, అనుషు, మురళీ శర్మ, రఘు బాబు, అజయ్, శ్రీనివాస్ రెడ్డి, హైపర్ ఆది, చమ్మక్‌ చంద్ర,     ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు సంగీతం లియోన్ జేమ్స్, కెమెరా: నిజర్ షఫీ, ఎడిటింగ్: చోట కె ప్రసాద్ చేశారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై రాజేష్ దండ, బాలాజీ గుట్ట, ప్రసన్న కుమార్‌ బెజవాడ కలిసి నిర్మించారు.