అలాంటి సినిమాతో వచ్చినందుకు క్షమించండి: విశ్వక్‌ సేన్‌

విశ్వక్‌ సేన్‌ తాజా చిత్రం ‘లైలా’ భారీ అంచనాలు, వివాదాల మద్య విడుదలై బోర్లా పడింది. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పృధ్వీ ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడటంతో ఆ పార్టీ మద్దతుదారులు #బాయ్ కాట్ లైలా అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేశారు. 

కానీ లైలా ప్రేక్షకులను మెప్పించలేకపోవడం, సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులు తిరస్కరించారు. #బాయ్ కాట్ లైలా అంటూ వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో చేసిన ప్రచారం కూడా సినిమా ఫ్లాప్ అవడానికి ఓ కారణమే. 

సినిమా ఫ్లాప్ అయినా సాధారణంగా హీరోలు వెంటనే చెప్పుకోరు.. ఒప్పుకోరు. కానీ విశ్వక్‌ సేన్‌ మాత్రం నిజాయితీ ఒప్పేసుకున్నారు. అందరినీ నిరాశ పరిచినందుకు క్షమాపణలు కూడా చెప్పుకున్నారు. ఇకపై అశ్లీలత లేకుండా మంచి సినిమాలు చేసి అందరినీ మెప్పిస్తానని చెపుతూ సోషల్ మీడియాలో ఓ లేఖ పోస్ట్ చేశారు కూడా. విశ్వక్‌ సేన్‌ ఏమన్నారో ఆయన మాటలలోనే..