ఆమెపై మనసు పడ్డ పవన్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన సినిమాల జోరు పెంచాడు. ఇప్పటికే కాటమరాయుడు సెట్స్ మీద ఉండగా త్రివిక్రం సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆల్రెడీ ముహుర్తం పెట్టుకున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ఓకే అవ్వగా సినిమాలో మరో హీరోయిన్ కు చాన్స్ ఉండటంతో అందుకు సెక్సీ బ్యూటీ పూజా హెగ్దెను సెలెక్ట్ చేశారట. సౌత్ లో ముఖ్యంగా టాలీవుడ్ లో పవన్ స్టామినా ఫాలోయింగ్ ఏంటో తెలిసిందే. అలాంటి పవన్ కుర్ర హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడం గొప్ప విషయం.

కీర్తి సురేష్ ఓ రేంజ్ ఫాంలో ఉండగా ఆమెకు పిలిచి అవకాశం ఇచ్చారు పవన్, త్రివిక్రం ఇక ఇప్పుడు పూజాకు పవన్ పిలుపు అందిందని అంటున్నారు. మొహెంజోదారో సినిమా ఫ్లాప్ అయినా సరే పూజా మాత్రం అందులో అందరిని ఆకట్టుకుంది. యువత మనసు దోచిన ఈ సుందరి ఇప్పుడు పవన్ సినిమాలో ఛాన్స్ కొట్టేయడం నిజంగా లక్కీ అని చెప్పాలి. ఇప్పటికే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం సినిమాలో నటిస్తున్న పూజా పవన్ సినిమాలో కన్ఫాం అయితే కనుక ఇక తిరుగుండదని చెప్పొచ్చు.