
జూ.ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సినిమా షూటింగ్ గురువారం నుంచి హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం కాబోతోంది. తొలి షెడ్యూల్లోనే 1,500 మంది జూనియర్ ఆర్టిస్టులతో షూటింగ్ ప్రారంభిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. తొలి షెడ్యూల్ దాదాపు 10 రోజులు సాగుతుందని సమాచారం.
బంగ్లాదేశ్ నేపధ్యంలో యాక్షన్ మూవీగా తీస్తున్న ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే పేరు ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది. తొలి షెడ్యూల్లో జూ.ఎన్టీఆర్ పాల్గొనడం లేదు. మార్చి నెలలో మొదలయ్యే రెండో షెడ్యూల్లో జాయిన్ అవుతారు. కన్నడ భామ రుక్మిణీ వసంత్ ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్‌కి జోడీగా నటించబోతోంది.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి పాన్ ఇండియా మూవీగా దీనిని తెరకెక్కించబోతున్నాయి. ఈ సినిమాని 2026 జనవరిలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకొని షూటింగ్ మొదలుపెడుతున్నారు.
And it begins… #NTRNeel https://t.co/Te4RFvnT68