నేడే ‘బాపూ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌...

పూర్తి తెలంగాణ నేపధ్యంతో వస్తున్న మరో చక్కటి సినిమా ‘బాపూ.’ ఈ సినిమా మరో మూడు రోజులలో అంటే ఫిబ్రవరి 21న విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరుగబోతోందని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదాలచినావారి కోసం shreyas.media/b ద్వారా ఉచిత పాసులు పొందవచ్చు.    

 ఈ సినిమాలో బ్రహ్మాజీ, ఆమని, అవసరాల శ్రీనివాస్, బలగం సుధాకర్ రెడ్డి, గంగవ్వ, ధన్య బాలకృష్ణ, మణి ఎగుర్ల, రచ్చ రవి తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై రాజు, భాను ప్రసాద్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి కధ: దయ, పాటలు: శ్యామ్ కాసర్ల, సంగీతం: ఆర్‌ఆర్‌ ధృవన్, కెమెరా: వాసు పెండెం చేస్తున్నారు.