
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లాది వశిష్ట దర్శకత్వంలో చేస్తున్న విశ్వంభర దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు. కనుక ఈ సినిమా విడుదల చేసిన తర్వాత చిరంజీవి ఫ్రీ అయిపోతారు.
దీని తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా మొదలుపెడతారని మొదట అనుకున్నప్పటికీ అనిల్ రావిపూడితో మొదలుపెట్టాలని నిర్ణయించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే నెలలో మొదలు పెట్టి వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల చేయాలనుకుంటున్నట్లు ఈ సినిమా నిర్మాత సాహు గారపాటి చెప్పేశారు.
విక్టరీ వెంకటేష్‌కి ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని పక్కా కమర్షియల్ సినిమా కోసం కధ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది.
విశ్వక్ సేన్ హీరోగా సాహు గారపాటి నిర్మించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరుగబోతోంది. ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా చిరంజీవి రాబోతున్నారు. అనిల్ రావిపూడి కూడా రాబోతున్నారు. కనుక రేపు వీరిద్దరి కాంబినేషన్‌లో తీయబోయే సినిమాకి సంబందించి నిర్ధిష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది.