ప్రభాస్ విలన్ అతనే..!

బాహుబలి తర్వాత ప్రభాస్ రన్ రాజా రన్ డైరక్టర్ సుజిత్ డైరక్షన్లో సినిమాకు ఫిక్స్ అయ్యాడని తెలిసిందే. 150 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ కు విలన్ గా నటిస్తున్నాడు బాలీవుడ్ విలన్ టర్నెడ్ హీరో నీల్ నితిన్ ముఖేష్. బీ టౌన్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత విలన్ గా మారిన నీల్ నితిన్ ఇప్పటికే కోలీవుడ్ లో విజయ్ కు విలన్ గా చేసి క్రేజ్ సంపాదించాడు. ఇక ప్రభాస్ కు విలన్ అంటే కొన్ని కాలిక్యులేషన్స్ ఉంటాయి వాటికి తగ్గట్టుగా నీల్ నితిన్ సూట్ అవుతాడని అతన్ని ఓకే  చేశారట.

బాహుబలితో ప్రపంచ స్థాయి మార్కెట్ ఏర్పరచుకున్న ప్రభాస్ సుజిత్ లాంటి ఒక సినిమా అనుభవమున్న డైరక్టర్ తో చేయడం రిస్క్ అనిపిస్తున్నా కథ మీద తనకున్న నమ్మకంతో ఈ మూవీ చేస్తున్నాడట. ఇక ఈ సినిమాను యువి ప్రొడక్షన్ బ్యానర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తారట. డిసెంబర్ లో స్టార్ట్ అవనున్న ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే పూర్తి చేసుకుని ఉన్నారట. ప్రభాస్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు సినిమా ముహుర్తం పెట్టేయడమే అని తెలుస్తుంది.