ఈరోజు సాయంత్రం లైలా సినిమా ట్రైలర్ వచ్చేసింది. అమీర్ పేటలోని ఏఏఏ సినిమాస్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఓ మహిళా విలేఖరి ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ బాగా ఎక్కువ ఉంది కదా మరి పిల్లలని కూడా మీ సినిమా చూడచ్చా లేక 18 ఏళ్ళు పైబడినవారికి మాత్రమేనా?” అని విశ్వక్ సేన్‌ని సూటిగా ప్రశ్నించారు.
విశ్వక్ సేన్ ఏమాత్రం తడబడకుండా, “మేము తీసిన సినిమాకి సెన్సార్ బోర్డ్ ఓ సర్టిఫికేట్ ఇచ్చింది. అది చూసి మీరే నిర్ణయించుకోండి,” అని లౌక్యంగా సమాధానం చెప్పారు. సినిమాలకి పెద్ద హీరోలు ముఖ్య అతిధులుగా ఆహ్వానిస్తుండటం గురించి అడిగిన మరో ప్రశ్నకు, “దీనిలో ఏదో ఉందని కారణాలు వెతకొద్దు. అందరం సినీ పరిశ్రమలో ఉన్నాము. కనుక ఎవరైనా సినిమాల మీద ప్రేమ, అభిమానంతోనే వీలుని బట్టి ఇటువంటి కార్యక్రమాలకు వస్తుంటారు తప్ప వేరే ప్రత్యేకమైన కారణాలు లేవు. మీరు ఏదేదో ఊహించేసుకొని వ్రాసేసి అందరినీ భయపెట్టకండి,” అని నవ్వుతూ సమాధానం చెప్పారు.
ఈ సినిమాలో విశ్వక్ సేన్‌కి జోడీగా ఆకాంక్ష శర్మ నటించింది. సంగీతం: తనిష్క్ బాగ్చీ, సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ప్రసాద్ చేశారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ‘లైలా’ వాలంటైన్స్ డే నాడు అంటే 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.