మరీ ఇంత హెవీ డోసా లైలా?

విశ్వక్‌ సేన్‌, ఆకాంక్ష శర్మ జంటగా నటించిన ‘లైలా’ సినిమా ట్రైలర్‌ వచ్చేసింది. అమ్మాయి వేషంలో విశ్వక్‌ సేన్‌ ఆదరగొట్టేశాడు. కామెడీ బాగుంది కానీ డబుల్ మీనింగ్ డైలాగులే తట్టుకోవడం కష్టం.

ఓ లోకల్ ఎమ్మెల్యేని తప్పించుకోవడానికి ఆడవేషం వేసి ఆ ఎమ్మెల్యే, అనుచరులను తన చుట్టూ తిప్పించుకుంటూ ఏవిదంగా ఓ ఆట ఆడించాడో ట్రైలర్‌లో చూపించేసి, సినిమాలో హీరోగా ఫైట్స్ చేయాల్సిన విశ్వక్‌ సేన్‌, లైలా వేషం ఎందుకు వేయాల్సి వచ్చిందో దర్శకుడు రామ్ నారాయణ చెప్పేశాడు.

అయితే మాస్ కా దాస్‌కి సినిమాలో ఓ అందమైన హీరోయిన్ ఉంది. కనుక ఆమెతో డ్యూయేట్స్ తప్పనిసరి. హీరో కనుక ఓ నాలుగైదు ఫైట్స్ తప్పనిసరి. కనుక రామ్ నారాయణ ఆ ఫార్ములా ఫాలో అయిపోయాడు.  

ఈ సినిమాకు సంగీతం: తనిష్క్ బాగ్చీ, సినిమాటోగ్రాఫర్‌: రిచర్డ్ ప్రసాద్ చేస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన లైలా వాలంటైన్స్ డే నాడు అంటే 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. సారీ రాబోతున్నాడు.