
ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ లో ఓ సినిమా హిట్ కొట్టడం ఎంత కష్టమో తెలిసిందే.. ఇక వారం రోజులుగా సినిమాలు పెద్ద నోట్ల కష్టాలు పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఎక్కడికి పోతావు చిన్నవాడాగా వచ్చాడు యువ హీరో నిఖిల్. మొదటి షో నుండే హిట్ టాక్ సొంతం చేసుకున్న నిఖిల్ తన ఆందాన్ని కన్నీళ్ల రూపంలో తెలిపి అభిమానులకు థాంక్స్ చెప్పాడు. వారం క్రితం రిలీజ్ అయిన సాహసం శ్వాసగా సాగిపో మంచి టాక్ వచ్చినా కలక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి. అయితే ఈ సమయంలో సినిమా రిలీజ్ చేయాలంటేనే ఆలోచించాలి అలాంటిది ధైర్యంగా తన సినిమాను వదిలాడు నిఖిల్.
సినిమా హిట్ అన్న టాక్ రాగానే తన ట్వీట్ తో ప్రేక్షకులను కూడా ఇంప్రెస్ చేశాడు నిఖిల్. ఒకప్పటిలా కాకుండా నిఖిల్ తన ప్రతి సినిమాను కొత్త ప్రయత్నంతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య తర్వాత శంకరాభరణం కాస్త నిరాశ పరచినా సరే మళ్లీ ఎక్కడికి పోతావు చిన్నవాడాతో సూపర్ హిట్ అందుకున్నాడు. మరి ఈ హిట్ మేనియా ఇలానే కంటిన్యూ చేస్తాడా లేక మళ్లీ ట్రాక్ తప్పుతాడా అన్నది చూడాలి.