రాజమండ్రికి రామ్ పోతినేని.. నెలరోజులు అక్కడే రాపో!

మహేష్ బాపు దర్శకత్వంలో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోరే జంటగా ‘రాపో22’ వర్కింగ్ టైటిల్‌తో చేస్తున్న సినిమా మొదటి షెడ్యూల్‌ షూటింగ్ హైదరాబాద్‌లో ముగిసింది. దీని తర్వాత షెడ్యూల్‌ రాజమండ్రి, గోదావరి నది పరిసర ప్రాంతాలలో చేయబోతున్నారు.

అక్కడే సుమారు నెలరోజుల పాటు ఏకధాటిగా ముఖ్యమైన సన్నివేశాలు, కొన్ని పాటలు ఘాట్ చేయబోతున్నారు.

కనుక రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోరేతో సహా సినిమాలో ముఖ్య పాత్రలు చేస్తున్న నటీనటులు అందరూ రాజ్యమండ్రికి బయలుదేరుతున్నారు. ఈ సినిమాలో దక్షిణాదికి చెందిన ఓ పెద్ద హీరో కూడా ఓ కీలకపాత్ర చేయబోతున్నారు. కానీ ఆ పాత్రకి ఎవరిని ఎంపిక చేశారో ఇంకా ప్రకాయించలేదు. 

గత ఏడాది నవంబర్ 21న ఈ సినిమా పూజా కార్యక్రమం చేసినప్పుడు విడుదల చేసిన పోస్టర్‌తో ఇదో  పీరియాడికల్ మూవీ అని దర్శకుడు హింట్ ఇచ్చారు. 

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి పాటలు: రామ్ మిరియాల, కార్తీక్ సంగీతం: వివేక్, మెర్విన్, కెమెరా: మధు నీలకందన్‌ చేస్తున్నారు.