
రామ్ నారాయణ దర్శకత్వంలో విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ జంటగా నటించిన ‘లైలా’ సినిమా వాలంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నందున లైలా ట్రైలర్ విడుదలకి ముహూర్తం పెట్టేశారు.
హైదరాబాద్, అమీర్ పేట వద్ద గల ఏఏఏ సినిమాస్‌లో ఈరోజు మద్యాహ్నం 3 గంటల నుంచి ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ ప్రారంభం అవుతుందని ఈ సినీ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ ట్విట్టర్లో ప్రకటించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే అభిమానుల కోసం ఉచితంగా పాసులు ఇస్తున్నామని, www.youmedia.com వెబ్ సైట్ ద్వారా పొందవచ్చని తెలియజేసింది.
ఇంతవరకు చాలా రఫ్ అండ్ టఫ్ పాత్రలకే పరిమితమైన విశ్వక్ సేన్ తొలిసారిగా లైలా సినిమాలో ఓ అందమైన అమ్మాయిగా నటించారు.
ఈ సినిమాకు సంగీతం: తనిష్క్ బాగ్చీ, సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ప్రసాద్ చేస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు.