
సౌత్ ఇండియన్ డైరక్టర్స్ లో మురుగదాస్ కు ఓ సెపరెట్ ఇమేజ్ ఉంది. ఆయన తీసే ప్రతి సినిమాలో ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారు. అయితే ఎంతో క్రేజ్ ఉన్న ఈ దర్శకుడు అమ్మాయిల మధ్య తప్ప తాగి అసభ్యంగా ప్రవర్తించాడని కోలీవుడ్ మీడియా న్యూస్. ప్రస్తుతం హాట్ న్యూస్ గా మారిన ఈ విషయంపై మురుగదాస్ తన మీద ఎవరో కావాలని ఇలాంటి నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారని అన్నాడు. అంతేకాదు ఈ విషయంపై తాను పోలీస్ కేసు కూడా పెట్టబోతున్నాడట.
ఇదిలా ఉండగా ఓ మహిళ మురుగదాస్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని అంటుంది. ఆమె ఎవరు అసలు ఎందుకు మురుగదాస్ ను టార్గెట్ చేసింది అన్నది తెలియలేదు. ఏది ఏమైనా సౌత్ లో టాలెంటెడ్ డైరక్టర్ మురుగదాస్ మరి అలాంటి దర్శకుడి మీద ఇలాంటి కామెంట్స్ అందరికి షాక్ ఇస్తుంది. ప్రస్తుతం అందరు దీని మీద డిస్కషన్స్ చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే మురుగదాస్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేస్తున్నాడు. ఏజెంట్ శివ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో మహేష్ కు జతగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది.