
గత ఏడాది ‘క’ సినిమాతో హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరానికి ‘క’ అక్షరం సెంటిమెంట్‌గా మారినట్లుంది. అందుకే తాను చేయబోతున్న కొత్త సినిమాకి ‘కె-ర్యాంప్’ అనే పేరు ఖరారు చేశారు. జైన్స్ నాని ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. సోమవారం హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోలో ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు క్లాప్ కొట్టి లాంఛనంగా షూటింగ్ ప్రారంభించారు.
ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా నటించబోతోంది. వెన్నెల కిషోర్, సీనియర్ నరేష్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: జైన్స్ నాని, సంగీతం: చేతన భరద్వాజ, కెమెరా: సతీష్ రెడ్డి మాసం, ఆర్ట్: సుధీర్ మాచర్ల, ఎడిటింగ్: ఛోటా కే ప్రసాద్ చేస్తున్నారు.
హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ నిర్మిస్తున్న ఈ సినిమాకి సహ నిర్మాతలు బాలాజీ గుట్ట, ప్రభాకర్ బురుగు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని దర్శకుడు జైన్స్ నాని చెప్పారు.