అమీర్ ఖాన్ గజిని-2 చేయబోతున్నారా?

మురగదాస్ దర్శకత్వంలో సూర్య, ఆశిన్ జంటగా 2008లో తమిళంలో విడుదలైన గజిని సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో దానిని అల్లు అర్వింద్‌ హిందీలో అమీర్ ఖాన్ హీరోగా రీమేక్ చేస్తే భారతీయ సినీ చరిత్రలో తొలిసారిగా వంద కోట్లు సాధించిన సినిమాగా నిలిచింది. 

ఇటీవల ముంబయిలో జరిగిన ‘తండేల్’ హిందీ ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో అమీర్ ఖాన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్వింద్‌ గజినీ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ దానికి సీక్వెల్‌గా గజినీ-2 తీసి ఈసారి వెయ్యి కోట్లు కలెక్షన్స్‌ సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. దానికి అమీర్ ఖాన్ కూడా సానుకూలంగా స్పందించారు. దీని కోసం మురుగదాస్ ఇప్పటికే కధ సిద్దం చేస్తున్నారు. అల్లు అర్వింద్‌ వంటి పెద్ద నిర్మాత ఊరికే కాలక్షేపానికి ఇటువంటి మాటలు మాట్లాడరు. కనుక తప్పకుండా రాబోయే రోజుల్లో గజినీ-2 మొదలయ్యే అవకాశం ఉంటుంది.