
మెగాస్టార్ చిరంజీవి-బాబి కొల్లి దర్శకత్వంలో చేసిన వాల్తేర్ వీరయ్య గత ఏడాది సంక్రాంతికి విడుదలై హిట్ కొట్టింది. కనుక మళ్ళీ బాబి కొల్లి దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి వీరాభిమానిగా ఈసారి ఆయన రేంజ్ మరింత పెంచేలా ఓ స్టోరీ సిద్దం చేసుకుంటున్నారట!
త్వరలో విశ్వంభర ముగుస్తుంది. దాని తర్వాత అనిల్ రావిపూడితో ఓ సినిమా, శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చిరంజీవి చేయాల్సి ఉంది. కనుక ఆ రెండూ పూర్తి చేసిన తర్వాతే బాబి కొల్లితో సినిమా మొదలుపెట్టే అవకాశం ఉంటుంది.
ఆ రెండు పూర్తి చేసేందుకు సుమారో 8-10 నెలలు పడుతుందనుకుంటే, చిరంజీవి-బాబీ సినిమా అక్టోబర్ తర్వాత లేదా ఈ ఏడాది చివర్లోగా ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుంది.
అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్‌కి ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి గొప్ప హిట్ అందించారు. కనుక చిరంజీవితో సినిమా అంటే భారీ అంచనాలే ఉంటాయి. చిరంజీవి విశ్వంభర పూర్తి చేసి బయటకు రాగానే అనిల్ రావిపూడితో సినిమా మొదలుపెడతారు.
ఇక శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నానితో ‘ది ప్యారడైజ్’ మొదలుపెట్టారు. కనుక అది పూర్తి చేసేలోగా అనిల్ రావిపూడితో చిరంజీవి సినిమా పూర్తయిపోవచ్చు. కనుక ఓదెలతో మొదలుపెట్టేయగలరు.