
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ‘దసరా’ సూపర్ హిట్ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు వారిద్దరి కాంబినేషన్లో ‘ది ప్యారడైజ్’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు, రమ్య కృష్ణ ముఖ్య పాత్రలు చేయబోతున్నారు. ఆమె నాని తల్లి పాత్ర చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టామని, ఈ సినిమాకు సంగీతం అనిరుధ్ చేస్తున్నారని శ్రేయస్ మీడియా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసింది.
ఈ సినిమాని కూడా దసరా సినిమా నిర్మాత చెరుకూరి సుధాకర్ ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్ర కాస్త భిన్నంగా ఉంటుందట. దీని కోసం సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబుని సంప్రదించగా ఆయన ఓకే చెప్పారు. ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా చేయబోతున్నారు.
The beats of Hyderabad will resonate all across the globe 💥💥🎼#TheParadise is a ROCKSTAR @anirudhofficial musical ❤️🔥
— SLV Cinemas (@SLVCinemasOffl) February 2, 2025
Natural Star @NameisNani in a @odela_srikanth cinema. Shoot begins soon 🔥@sudhakarcheruk5 @TheParadiseOffl pic.twitter.com/S9n9mfqkx4