.jpg)
ఈరోజు సాయంత్రం హైదరాబాద్ ‘తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగాల్సి ఉండగా అనివార్య కారణాల వలన రేపటికి వాయిదా పడింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా అల్లు అర్జున్ పాల్గొనబోతున్నారు. అయితే అల్లు అర్జున్ వస్తే అభిమానులు పెద్ద ఎత్తున వస్తారు కనుక కార్యక్రమంలో మళ్ళీ అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంటుందని, మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకొని ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని భావించారేమో తెలీదు.
కానీ “ఈపాలి (ఈసారి) యాట (వేట) గురితప్పేదేలే..” అంటూ పోస్టర్లో పెట్టుకొని ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా వేసుకోవడం వలన మొదటే గురి తప్పినట్లయింది కదా?
చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘తండేల్’ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా సాయి పల్లవి నటించిన సంగతి తెలిసిందే.
ఈ సీమాకు కధ: కార్తీక్ తీడ, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: శాందత్, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, బన్నీ వ్యాస్ కలిసి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నిర్మించిన తండేల్ ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది.
Ee Saari Assalu Guri Thappedhe ledhesss 🎯🔥⚓
ICONIC #ThandelJaathara on Feb 2nd, 5PM onwards.
▶️ https://t.co/uvapJvPwQG#Thandel #AlluArjun #ThandelonFeb7th pic.twitter.com/syXpnaD5q5