విజయ్ దేవరకొండ సినిమా టైటిల్‌ త్వరలో

లైగర్‌, ఖుషీ, ఫ్యామిలీ స్టార్ వరుసగా మూడు ఫ్లాపుల తర్వాత విజయ్ దేవరకొండ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తన 12వ సినిమా మొదలు పెట్టాడు. నాచురల్ స్టార్ నానికి ‘జెర్సీ’ వంటి సూపర్ హిట్ అందించినందున, గౌతమ్‌-విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. 

సినిమా మొదలుపెట్టి చాలా కాలమే అయినప్పటికీ ఇంతవరకు అప్‌డేట్‌ ఇవ్వకపోవడంతో అభిమానులు దర్శక నిర్మాతల చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాటిపై నిర్మాత నాగ వంశీ స్పందిస్తూ, “మీరందరూ తిట్లు భరించలేక గౌతమ్‌ని చాలా హింసించి సినిమా టైటిల్‌ ఖరారు చేశాము. త్వరలోనే టైటిల్‌ ప్రకటిస్తాము,” అని ట్వీట్ చేశారు. 

ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి జోడీగా భాగ్యశ్రీ భోరే నటిస్తోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తొలిసారిగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసరుగా పోలీస్ యూనిఫారంలో కనిపించబోతున్నాడు.కనుక అభిమానులు చాలా ఆతృతగా విడి12 అప్‌డేట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. 

ఈ సినిమాకు సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, కెమెరా: గిరీష్‌ గంగాధరన్‌ చేస్తున్నారు.  

ఈ నెల 7న సినిమా టైటిల్‌తో పాటు టీజర్‌ కూడా విడుదల చేయబోతున్నట్లు తాజా సమాచారం. అదే రోజున సినిమా రిలీజ్‌ డేట్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాని 2025, మార్చి 28న విడుదల చేయబోతున్నట్లు ఫస్ట్-లుక్ పోస్టర్‌లోనే ప్రకటించేశారు. కానీ మే 30కి వాయిదా పడవచ్చని తెలుస్తోంది.