మళ్ళీ సినిమా ఈవెంట్స్‌కి అల్లు అర్జున్‌

సంధ్య థియేటర్‌ ఘటన తర్వాత అల్లు అర్జున్‌ సినీ కార్యక్రమాలలో పాల్గొనలేదు. తొలిసారిగా రేపు (ఫిబ్రవరి 1)న హైదరాబాద్‌లో జరుగబోయే‘తండేల్‌’ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈవిషయం ‘తండేల్‌’ చిత్ర బృందం సోషల్ మీడియాలో తెలియజేస్తూ ‘తండేల్‌ జాతర’కు పుష్పరాజ్ ముఖ్య అతిధిగా రాబోతున్నారంటూ ఓ పోస్టర్ పెట్టింది.

దానిలో పుష్ప-2లో గంగమ్మ జాతరలో స్త్రీ వేషంలో ఉన్న అల్లు అర్జున్‌, దాని ముందు ‘తండేల్‌’ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి త్రిశూలాలు పట్టుకొని డాన్స్ చేస్తున్న ఫోటో పెట్టారు. రేపు సాయంత్రం 5 గంటల నుంచి హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం మొదలవుతుందని తెలిపారు. కానీ హైదరాబాద్‌లో ఎక్కడో చెప్పనేలేదు. 

ఇక చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘తండేల్‌’ సినిమాకు కధ: కార్తీక్ తీడ, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: శాందత్, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, బన్నీ వ్యాస్ కలిసి తెలుగు, తమిళ్, హిందీ  భాషల్లో నిర్మించారు. తండేల్‌ ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది. ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది.