ప్రభాస్‌ స్పిరిట్ అలా ఉంటుంది మరి!

ప్రభాస్‌ ప్రస్తుతం మారుతితో రాజాసాబ్ చేస్తున్నారు. అది చేస్తూనే హను రాఘవపూడితో ఫౌజీ కూడా మొదలుపెట్టేశారు. రెండు సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

అయితే రాజాసాబ్ పూర్తయిన తర్వాత కూడా ప్రభాస్‌ మళ్ళీ ‘ఫౌజీ’ సందీప్ వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంటే ఒక సినిమా పూర్తయిన తర్వాత మరొకటి కాకుండా రెండేసి సినిమాలు ఒకేసారి చేస్తూ దర్శక నిర్మాతలకు, అభిమానులకు కూడా నిజంగా డార్లింగ్ అయ్యారు ప్రభాస్‌. 

సందీప్ వంగా సినిమా స్క్రిప్ట్ పని పూర్తయిపోవడంతో మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టిన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నెలాఖరులోగా రాజాసాబ్‌ పూర్తిచేసి బయటకు వచ్చేస్తే మే నుంచి స్పిరిట్ మొదలుపెట్టేందుకు వీలుగా సందీప్ వంగా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

ఈ మూడు సినిమాలు పూర్తవగానే ప్రభాస్‌ కల్కి-2, సలార్-2 చేయాలి. వాటి తర్వాత మరో మూడు సినిమాలు చేస్తారని హోంబలే ప్రొడక్షన్‌ ఇదివరకే ప్రకటించింది. కనుక మరో 3-4 ఏళ్ళ వరకు ప్రభాస్‌ బుక్ అయిపోయిన్నట్లే!