
సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్లో డిసెంబర్ 5న విడుదలైన పుష్ప-2 కోసం ఓటీటీలో ప్రేక్షకులు కళ్ళు కాయాలు కాసేలా ఎదురుచూస్తున్నారు. వారందరికీ ఈ శుభవార్త. పుష్ప-2 నేటి నుంచే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ప్రసారం అవుతోంది. అదీ.. అదనంగా కలిపిన 20 నిమిషాల వీడియోటో కలిపి లోడడ్ వెర్షన్ ప్రసారం అవుతోంది. కనుక ఓటీటీ ప్రేక్షకులు హాయిగా తమ ఇంట్లో కూర్చొని పుష్పరాజ్ హడావుడి చూసేయొచ్చు.
పుష్ప మొదటి భాగానికి కొనసాగింపుగా వచ్చిన పుష్ప-2 కధ ఇప్పటికే అందరికీ తెలుసు. కనుక దాని గురించి మళ్ళీ చెప్పుకోనవసరం లేదు. నెట్ఫ్లిక్స్లో సిద్దంగా ఉన్న పుష్ప-2ని చూసేస్తే సరిపోతుంది. పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు.
ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తయ్యాయి. మార్చి నుంచి ఈ సినిమాని రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఆలోగా అల్లు అర్జున్ ఫ్యామిలీతో విదేశాలలో రౌండ్ వేసి వస్తారేమో?