అమెజాన్ ప్రైమ్‌లో గేమ్ చేంజర్‌ ఎప్పటి నుంచంటే...

దర్శకుడు శంకర్ ఒకేసారి ఇద్దరు పెద్ద హీరోలకు, వారి అభిమానులకు తీవ్ర నిరాశ, నిర్మాతలకు తీరని నష్టం మిగిల్చారు. భారతీయుడు-2తో కమల్ హాసన్, గేమ్ చేంజర్‌తో రామ్ చరణ్‌కి తీరని అప్రదిష్ట మిగిలింది.

నిర్మాతలతో వందల కోట్లు ఖర్చు చేయించినా రెండు సినిమాలు తీవ్ర నిరాశ పరిచాయి. కమల్ హాసన్, రామ్ చరణ్‌ అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. కానీ రెండు సినిమాలు ఆడలేదు. కనుక దీనికి పూర్తి బాధ్యత దర్శకుడు శంకర్‌దే తప్ప వారిది కాదు. 

గేమ్ చేంజర్‌ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10న విడుదలైంది. ఫిబ్రవరి 10కి నెలరోజులు పూర్తవుతుంది కనుక ఆ తర్వాత ఎప్పుడైనా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేస్తుంది లేదా ముందే వచ్చేసినా ఆశ్చర్యం లేదు. రూ.450 కోట్లు భారీ బడ్జెట్‌తో తీసిన గేమ్ చేంజర్‌ కధ ఈవిదంగా ముగిసిపోతుండటం బాధాకరమే. 

గేమ్ చేంజర్‌ తర్వాత రామ్ చరణ్‌ దర్శకుడు బుచ్చిబాబు సనాతో సినిమా మొదలుపెట్టారు. ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్‌ నటిస్తుంది.