
గులాబీ బుగ్గల సుందరి సాయి పల్లవి కేవలం ఎంపిక చేసుకున్న సినిమాలలోనే నటిస్తుంటుంది. అలా ఆమె ఎంపిక చేసుకుని నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతుంటాయి కూడా. ఆమె నటించిన అమరన్ సినిమా సూపర్ హిట్ అవడమే ఇందుకు తాజా ఉదాహరణ.
ఇప్పుడు నాగ చైతన్యతో కలిసి ‘తండేల్’ సినిమా చేస్తోందంటే అదీ తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని భావించవచ్చు. తండేల్ ట్రైలర్.. దానిలో కధ, ఆమె నటన చూస్తే సూపర్ హిట్ అవడం ఖాయమనే అనిపిస్తుంది.
కనుక ఆమె తమ సినిమా ఒప్పుకుందంటే నిర్మాతలకు ముందే శుభసూచకంగా భావిస్తున్నారు. కనుక ఆమె అదిగినంత పారితోషికం ఇచ్చేందుకు సిద్దపడుతున్నారు. ఇదివరకు ఆమె ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు తీసుకునేది. ఇప్పుడు రూ.5-6 కోట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది.
తండేల్ సినిమాకు ఆమె రూ.5 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఆమె ఈ వార్తలను ఖండించకపోవడం గమనిస్తే ధృవీకరించిన్నట్లే భావించవచ్చు. అయినా సినిమా సూపర్ హిట్ అయ్యి మంచి లాభాలు వస్తాయంటే ఏ నిర్మాత వద్దంటాడు?
తండేల్ సినిమాకు కధ: కార్తీక్ తీడ, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: శాందత్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, బన్నీ వ్యాస్ కలిసి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. తండేల్ ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది.