
త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్, రీతువర్మ జంటగా నటించిన ‘మజాకా’ సినిమా నుంచి బ్యాచిలర్ ఏంథమ్ లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. రామజోగయ్య శాస్త్రి వ్రాసిన ఈ పాటని లియోన్ జేమ్స్ స్వరపరచగా, ధనుంజయ్ సీపన పాడారు.
విశాఖలో రామకృష్ణా బీచ్ ఒడ్డున ఘాట్ చేసిన ఈ పాటకి సందీప్ కిషన్‌తో కలిసి రావు రమేష్ కూడా హుషారుగా డాన్స్ చేయడం ఆకట్టుకుంటుంది. గర్ల్ ఫ్రెండ్ దొరక్క, పెళ్ళి చేసుకోవడానికి అమ్మాయి దొరక్క బ్యాచిలర్స్ పడే కష్టాలని ఈ పాటతో చెప్పారు. కనుక యువతకి ఈ పాట బాగా కనెక్ట్ అవుతుంది.
ఈ సినిమాలో రీతూ వర్మ, రావు రమేష్, మురళీ శర్మ, రఘుబాబు, అజయ్, అన్షు, శ్రీనివాస్ రెడ్డి, హైపర్ ఆదీ, చమ్మక చంద్ర తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే: ప్రసన్న కుమార్ బెజవాడ, సంగీతం లియోన్ జేమ్స్, కొరియోగ్రఫీ: రఘు మాస్టర్, కెమెరా: నిజర్ షఫీ, ఎడిటింగ్: చోట కె ప్రసాద్, యాక్షన్: పృధ్వీ మాస్టర్ చేశారు.
ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై రాజేష్ దండ, బాలాజీ గుట్ట, ప్రసన్న కుమార్ బెజవాడ కలిసి నిర్మించారు. ఫిబ్రవరి 21న మజాకా విడుదల కాబోతోంది.