తండేల్‌ ట్రైలర్‌ రిలీజ్‌… చైతు ఖాతాలో హిట్?

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చేసిన ‘తండేల్‌’ ట్రైలర్‌ మంగళవారం సాయంత్రం 6.03 గంటలకు విడుదల చేశారు. సినిమా టీజర్‌, పాటలలో చూపిన్నట్లే ట్రైలర్‌లో కూడా నాగ చైతన్య, సాయి పల్లవి మద్య ఘాడమైన ప్రేమని చాలా చక్కగా చూపారు. 

సముద్రంలోకి వెళ్ళి పాకిస్తాన్ కోస్ట్ గార్డులకు పట్టుబడి, ఆ దేశంలో జైలులో బందించబడటం, ఆ నేపధ్యంలో భారత్‌ పట్ల పాక్ అధికారుల ద్వేషభావం, ఆ సందర్భంగా అక్కడ జరిగిన ఘర్షణలలో మన హీరో నాగ చైతన్య దేశభక్తి ప్రదర్శిస్తూ చేసిన పోరాటాలు అన్నీ ట్రైలర్‌లో చూపించి క్లుప్తంగా సినిమా కధ చెప్పేశారు దర్శకుడు చందు మొండేటి. ట్రైలర్‌ చూస్తే నాగచైతన్య ఖాతాలో తప్పకుండా హిట్ పడుతుందనిపిస్తుంది.                

తండేల్‌ సినిమాకు కధ: కార్తీక్ తీడ, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: శాందత్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, బన్నీ వ్యాస్ కలిసి తెలుగు, తమిళ్, హిందీ  భాషల్లో నిర్మిస్తున్నారు. తండేల్‌ ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది.