
మెగాస్టార్ చిరంజీవి, త్రిష ప్రధాన పాత్రలలో మల్లాది వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
ఈ సినిమాలో ఆరు పాటలు ఉంటాయని కీరవాణి ముందే చెప్పేశారు. ప్రస్తుతం సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఆ పాటలకు సంబందించి పనులు జోరుగా సాగుతున్నాయని దర్శకుడు మల్లాది వశిష్ట తెలియజేశారు.
చిరంజీవి, చంద్రబోస్, కీరవాణితో కలిసి దిగిన ఓ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకున్నారు.
ఈ సినిమాకు కీరవాణి అద్భుతమైన సంగీతం అందించారని, ముఖ్యంగా పాటలన్నీ దేనికవే హైలైట్‌గా ఉంటాయని మల్లాది వశిష్ట చెప్పారు. సోషియో ఫాంటసీ స్టోరీతో తీస్తున్న విశ్వంభరలో మరో లోకం సృష్టించేందుకు 13 వేర్వేరు సెట్స్ వేశామని చెప్పారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మల్లాది వశిష్ట, డైలాగ్స్: సాయి మోహన్ బుర్రా, కెమెరా: మ్యాన్ ఛోటా కె నాయుడు, సంగీతం: ఎంఎం కీరవాణి, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, విక్రమ్, ప్రమోద్ కలిసి రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో తెరకెక్కిస్తున్న విశ్వంభర మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.