కన్నప్పలో ప్రభాస్‌ ఫస్ట్-లుక్‌

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాలో ప్రభాస్‌ నందీశ్వరుడుగా నటిస్తున్నట్లు మీడియా లీకులు ఇచ్చారే తప్ప ఇంత వరకు పోస్టర్ విడుదల చేయలేదు. ఈ సినిమాలో అనేక మంది హేమాహేమీలైన నటీనటులందరి పోస్టర్స్ విడుదల చేశారు. కానీ ప్రభాస్‌ పోస్టర్ ఇంతకాలం దాచి ఉంచారు.

మొహానికి అడ్డుగా ఉన్న త్రిశూలం వెనుక నుదుట విభూతి రేఖలతో ఉన్న ప్రభాస్‌ని చూపుతూ ఓ పోస్టర్ విడుదల చేశారు. దానిలో ఫిబ్రవరి 3న రెబెల్ స్టార్ ప్రభాస్‌ ఫస్ట్-లుక్‌ పోస్టర్ విడుదల చేస్తామని ప్రకటించారు. 

బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శివపార్వతులుగా బాలీవుడ్‌ నటుడు అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటి నుపూర్ సనన్ మంచు విష్ణుకి జోడీగా నటిస్తోంది. మోహన్ బాబు, బ్రహ్మానందం, శరత్ కుమార్, మోహన్ లాల్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

కన్నప్ప సినిమాకు మణిశర్మ, స్టీఫెన్ దేవాస్సీ: సంగీతం, షెల్డన్ షావ్: కెమెరా, చిన్న ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.  

ఈ సినిమాను అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మిస్తున్నారు.