
సంధ్య థియేటర్ ఘటన, తదనంతర పరిణామాలు ఈసారి టాలీవుడ్ పాలిట ‘గేమ్ చేంజర్’ అని భావించవచ్చు. అప్పటి నుంచి తెలుగు సినీ పరిశ్రమ పరిస్థితి ఒక్కసారిగా తారుమారు అయ్యింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లు లేవు.. ప్రివిలేజ్ షోలు, బెనిఫిట్ షోలు లేవు. చివరికి ట్రైలర్ రిలీజులు కూడా ఏపీలోనే జరుగుతున్నాయి.
చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చేసిన ‘తండేల్’ ట్రైలర్ ఈరోజు సాయంత్రం 6.03 గంటలకు విశాఖపట్నంలో శ్రీరామ టాకీస్‌లో విడుదల చేయబోతున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుగబోతోంది. శ్రీరామ టాకీస్‌లో అభిమానుల సమక్షంలో జరుగబోయే ఈ వేడుకలో పాల్గొనేందుకు నాగ చైతన్య, చిత్ర బృందం విశాఖపట్నం చేరుకున్నారు.
నాగ చైతన్యకు 23వ సినిమాగా వస్తున్న తండేల్కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు కధ: కార్తీక్ తీడ, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: శాందత్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
తండెల్ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, బన్నీ వ్యాస్ కలిసి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది.