
ఫిదా, జాతిరత్నాలు, బలగం వంటి తెలంగాణ నేపధ్యంతో చక్కటి సినిమాలు వస్తుండటం చాలా సంతోషం కలిగిస్తుంది. తాజాగా తెలంగాణ నేపధ్యంతో మరో చక్కటి సినిమా ‘బాపూ’ ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈరోజు ఆ సినిమా టీజర్ విడుదల చేశారు. కాస్త భావోద్వేగాలు, కాస్త హాస్యంతో చాలా చక్కగా ఉంది టీజర్. సినిమా మరింత అద్భుతంగా ఉంటుందని ఆశించవచ్చు.
ఈ సినిమాలో బ్రహ్మాజీ, ఆమని, అవసరాల శ్రీనివాస్, బలగం సుధాకర్ రెడ్డి, గంగవ్వ, ధన్య బాలకృష్ణ, మణి ఎగుర్ల, రచ రవి తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై రాజు, భాను ప్రసాద్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి కధ: దయ, పాటలు: శ్యామ్ కాసర్ల, సంగీతం: ఆర్ఆర్ ధృవన్, కెమెరా: వాసు పెండెం చేస్తున్నారు.