శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాల మద్య సంక్రాంతికి విడుదలైన గేమ్ చేంజర్ తీవ్ర నిరాశ పరిచింది. సినీ రంగంలో ఇటువంటి ఎదురుదెబ్బలు మామూలే కనుక బుచ్చిబాబుతో తన తదుపరి సినిమా మొదలుపెట్టేశారు.
ఇప్పటికే మైసూరులో ఓ చిన్న షెడ్యూల్ పూర్తిచేసిన రామ్ చరణ్, బుధవారం నుంచి హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలయ్యే షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. ఈ షెడ్యూలలో రాత్రివేళ జరిగే కొన్ని సన్నివేశాలు ఘాట్ చేయబోతున్నారు. రామ్ చరణ్‌తో సహా ముఖ్య నటీనటులందరూ దీనిలో పాల్గొనబోతున్నారు.
దేవరతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి జూ.ఎన్టీఆర్‌కి జోడీగా నటించిన జాన్వీ కపూర్, ఇప్పుడు ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జంటగా నటించబోతోంది. జగపతి బాబు, శివ రాజ్ కుమార్, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు.
దర్శకుడు సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సాన దర్శకత్వంలో నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ సినిమాని సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.