
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా డిసెంబర్ 5న విడుదలైన పుష్ప-2 కలెక్షన్స్ సునామీ సృష్టించింది. పుష్ప-2 ఓటీటీలోకి వచ్చేస్తోందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. తేదీ ప్రకటించలేదు.
కానీ సినిమా విడుదలైన 56 రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తుందని మైత్రీ మూవీ మేకర్స్ ముందే ప్రకటించింది కనుక ఈ నెల 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో పుష్ప-2 ప్రసారంఅయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో 20 నిమిషాల నిడివి గల సన్నివేశాలు కూడా కలిపి పుష్ప-2 రీలోడెడ్ వెర్షన్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ప్రసారం కాబోతోందని నెట్‌ఫ్లిక్స్ తెలియజేసింది.
పుష్ప మొదటి భాగంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాలో ఓ సాధారణ కూలీగా ప్రవేశించిన పుష్పరాజ్ (అల్లు అర్జున్) ఏవిదంగా ఎదిగాడో చూపారు. అది సూపర్ హిట్ అవడంతో దానికి సీక్వెల్‌గా తీసిన పుష్ప-2లో రాజకీయాలను శాశించే స్థాయికి ఎదగడం చూపారు. రెండో భాగం కూడా సూపర్ హిట్ అవడంతో పుష్ప-3 తీస్తామని అల్లు అర్జున్, సుకుమార్ ఇదివరకే ప్రకటించారు. కానీ ఇద్దరూ వేరే సినిమాలకు ముందే కమిట్ అయినందున ఈ ఏడాదిలో పుష్ప-3 మొదలుపెట్టే అవకాశం లేదు.
The man. The myth. The brAAnd 🔥 Pushpa’s rule is about to begin! 👊
Watch Pushpa 2- Reloaded Version with 23 minutes of extra footage on Netflix, coming soon in Telugu, Tamil, Malayalam & Kannada! pic.twitter.com/ZA1tUvNjAp