నాని హిట్ పోస్టర్...

శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్’ ఫస్ట్ కేస్, హిట్ సెకండ్ కేస్ పేరుతో విడుదలైన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ హిట్ సిరీస్‌ కొనసాగిస్తూ ‘హిట్: ది ధర్డ్ కేస్’లో నాచురల్ స్టార్ నాని పోలీస్ ఆఫీసర్‌ అర్జున్ సర్కార్‌గా నటిస్తున్నారు.

ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాని పోస్టర్ విడుదల చేశారు. నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని చేతిలో రివాల్వర్‌తో జెండా వందనం చేస్తున్నట్లున్న పోస్టర్ చాలా ఆకట్టుకుంటుంది. సందర్భోచితంగా కూడా ఉంది. కానీ ఓ పోలీస్ ఆఫీసర్ తుపాకీతో  జెండా వందనం చేయడం వివాదస్పదమయ్యే అవకాశం కూడా ఉంది.    

ఈ సినిమాలో అర్జున్ సర్కార్ (నాని) పోలీసుగా తక్కువ క్రిమినల్‌గా ఎక్కువ... ఛార్జ్ తీసుకున్నాడంటూ దర్శకుడు శైలేష్ కొలను నాని పాత్ర చాలా రఫ్ అండ్ టఫ్ అని ముందే చెప్పేశారు. 

ఈ సినిమాలో నానికి జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. కధ, దర్శకత్వం: శైలేష్ కొలను, సంగీతం: మిక్కీ జె మేయర్, కెమెరా: సను జాన్ వర్గీస్, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ చేస్తున్నారు.

ఈ సినిమా నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంత్ త్రిపిర్నేని నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025, మే 1వ తేదీన విడుదలకాబోతోంది.