రాబిన్‌హుడ్‌… మేకింగ్ వీడియో

వెంకీ కుడుమల దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా చేస్తున్న ‘రాబిన్‌హుడ్’ మార్చి 28న విడుదల కాబోతోంది. అంటే సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉందన్న మాట! కానీ ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిత్ర బృందం రాబిన్‌హుడ్‌ మేకింగ్ వీడియో విడుదల చేసింది.  

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: వెంకీ కుడుముల, సంగీతం: జీవి ప్రకాష్, కెమెరా: సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్, ఎడిటింగ్: కోటి చేస్తున్నారు. 

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ పాన్ ఇండియా మూవీగా వస్తున్న రాబిన్ హుడ్‌ నిర్మిస్తున్నారు.