
కోలీవుడ్ హీరో దళపతి విజయ్ 69వ తమిళ సినిమాకి ‘జన నాయగన్’ అనే పేరు ఖరారు చేసి నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలతో సెల్ఫీ దిగుతున్న ఫస్ట్-లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమా తెలుగులో బహుశః ‘జన నాయకుడు’ పేరుతో విడుదల చేస్తారేమో?
గత ఏడాది విజయ్ ‘తమిళక వెట్రి కజగం’ అనే పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించారు. రాబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికలలో పోటీ చేస్తామని ప్రకటించారు. కనుక ఆలోగా ఆయన చేసే సినిమాలన్నీ ఓ సమర్ధుడు, నీటి నిజాయితీ గల రాజకీయ నాయకుడుగా తనని తాను ప్రమోట్ చేసుకునే విదంగానే ఉంటాయి. ఇందుకు ఈ సినిమాయే నిదర్శనం.
ఈ సినిమాకు హెచ్ వినోద్, సంగీతం: అనిరుధ్, కెమెరా: సత్యన్ సూరయన్, యాక్షన్: ఏఎన్ఎల్ అరసు, ఆర్ట్: వీ. సెల్వకుమార్, ఎడిటింగ్: ప్రదీప్ ఈ రాఘవ, కొరియోగ్రఫీ: శేఖర్ విజే సుదన్ చేస్తున్నారు. ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సహ నిర్మాతలు జగదీష్ పళని స్వామి, లోహిత ఎన్కెలతో కలిసి వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు.