
చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చేస్తున్న ‘తండేల్’ ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రధానంగా ఓ రొమాంటిక్ స్టోరీ అయినప్పటికీ భారత్-పాక్ మద్య జరిగిన ఘటనలు చుట్టూ ఈ కధ అల్లుకున్నారు. కనుక నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేస్తారని అందరూ ఎదురు చూశారు. కానీ మంగళవారం విడుదల చేస్తామని తెలియజేస్తూ జాతీయ జెండాతో నాగ చైతన్య పోస్టర్ ఒకటి విడుదల చేశారు.
ఈ సినిమాకి కధ: కార్తీక్ తీడ, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: శాందత్, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు. ఈ సినిమాపై నాగ చైతన్య, దర్శక నిర్మాతలకు చాలా భారీ అంచనాలున్నాయి. కనుక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, బన్నీ వ్యాస్ కలిసి పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో దీనిని నిర్మించారు.