మాస్ జాతర మొదలైంది చూశారా?

సినీ కధా రచయిత రచయిత బొగ్గవరపు భాను దర్శకత్వంలో రవితేజ హీరోగా ‘మాస్ జాతర’ మొదలుపెట్టారు. ఇవాళ్ళ రవితేజ పుట్టిన రోజు ప్లస్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాస్ జాతర గ్లింమ్స్‌ విడుదల చేశారు. ఊహించిన్నట్లే రవితేజ మార్క్ మాస్ యాక్షన్, కామెడీ సీన్స్‌తో ప్రేక్షకులకు అందించారు. 

ఈ సినిమాలో రవితేజ పాత్ర పేరు లక్ష్మణ్ భేరీ అని తెలుస్తోంది. తెలంగాణ నేపధ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రవితేజకు జోడీగా శ్రీలీల నటిస్తోంది. 

ఈ సినిమా షూటింగ్‌ 80 శాతం పూర్తయింది. ఈ నెల 17 నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ మొదలుపెట్టి ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేసి మార్చి-ఏప్రిల్ నెలల్లో విడుదల చేయాలనుకుంటున్నారు.  

ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, డైలాగ్స్: ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.  

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి మాస్ జాతర సిద్దం చేస్తున్నారు.