విశాల్ మదగజరాజు ట్రైలర్‌.. 31న సినిమా!

సి సుందర్ దర్శకత్వంలో విశాల్ హీరోగా ‘మదగజరాజు’ సినిమా షూటింగ్‌ పూర్తయ్యి దాదాపు 12 ఏళ్ళయింది. అనివార్య కారణాల వలన ఇంతకాలం ఈ సినిమా విడుదల చేయలేకపోయారు. ఇన్నేళ్ళ తర్వాత ఇటీవల ఈ సినిమా ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 

సినిమా రిలీజ్‌ డేట్ దగ్గర పడుతోంది కనుక ట్రైలర్‌ విడుదల చేశారు. 12 ఏళ్ళ క్రితం అంటే హీరో విశాల్‌తో సహా నటీ నటులందరూ యవ్వనంలో ఉన్నప్పుడు సినిమా కావడంతో అందరూ చాలా హుషారుగా కనిపించారు. ఇంత ఆలస్యమైనప్పటికీ ట్రైలర్‌ నేటి ట్రెండ్స్ తగ్గట్లుగానే ఉంది. అది చూస్తే ఇది విశాల్ మార్క్ కామెడీ-యాక్షన్ ఎంటర్‌టైనర్‌ అని అర్దమవుతుంది. 

ఈ సినిమాలో సోనూసూద్, అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్‌, సంతానం, స్వర్గీయ మనోబాల, నితిన్ సత్య, సదాగోపన్‌ రమేష్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.

ఈ సినిమాకి సంగీతం: విజయ్ ఆంటోనీ, కెమెరా: రిచర్డ్ ఎమ్ నాధన్, ఫైట్స్: సూపర్ సుబ్బరాయన్, ఆర్ట్: గురురాజ్, కొరియోగ్రఫీ: బృంద, శోభి, ఎడిటింగ్: ప్రవీణ్, శ్రీకాంత్ చేశారు. 

జెమినీ ఫిలిమ్ సర్క్యూట్ సమర్పణలో సత్యకృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా తెలుగు వెర్షన్ నిర్మాతలు: అక్కినేని మనోహర్ ప్రసాద్, అక్కినేని ఆనంద్ ప్రసాద్.