అగత్యా నుంచి నేలమ్మ తల్లి లిరికల్..

కోలీవుడ్‌ యాక్షన్ స్టార్ అర్జున్, జీవా, సర్జా, రాశీఖన్నా ప్రధాన పాత్రలలో వస్తున్న అగత్యా సినిమా నుంచి ‘నేలమ్మ తల్లి.. ‘ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ విడుదలైంది. పీఏ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి యువన్‌ శంకర్ రాజా సంగీత దర్శకత్వం చేస్తున్నారు. శశాంక్ వెన్నెలకంటి వ్రాసిన ‘నేలమ్మ తల్లి.. ‘ అంటూ సాగే పాటని దేవు మాద్యూ ఆలపించారు. 

ఈ సినిమాలో రాధారవి, యోగి బాబు, ఎడ్వర్డ్ సోనెన్ బ్లిక్, మెటిల్డా తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమాకు కధ, దర్శకత్వం: పీఏ విజయ్, సంగీతం: యువన శంకర్ రాజా, కెమెరా: దీపక్ కుమార్‌ పాధే, ఆర్ట్: పి. షణ్ముగం, కొరియోగ్రఫీ: కలైమామణి శ్రీధర్, ఎడిటింగ్: శాన్‌ఫ్రాన్సిస్‌కో లోకేష్ చేస్తున్నారు. 

వెల్సీ ఫిల్మ్ ఇంటర్నేషనల్, వామిండియా బ్యానర్లపై ఇషారీ కే గణేష్, అనీష్ అర్జున్ దేవ్ కలిసి ఈ సినిమాని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల కాబోతోందని తెలియజేశారు.