రాజమౌళి చేతిలో పాస్‌పోర్టు... బోనులో సింహం!

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ఎంబీ29 వర్కింగ్ టైటిల్‌తో సినిమా షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసి తమ సినిమా గురించి చిన్న హింట్ ఇచ్చారు.

చిర్నవ్వు నవ్వుతూ కెమెరావైపు పాస్‌పోర్టు చూపిస్తుండగా ఆయన ఎదురుగా ఉన్న ఓ సింహాన్ని బోనులో బందించిన్నట్లు చూపారు ఆ వీడియోలో. అంటే ఈ సినిమా షూటింగ్‌ కోసం త్వరలో తామ బృందం ఆఫ్రికా బయలుదేరబోతోందని సూచించిన్నట్లు భావించవచ్చు. ఇదివరకు ఈ సినిమా కోసం ఆఫ్రికాలో పర్యటించి లొకేషన్స్ ఎంపిక చేసుకువచ్చారు. కనుక అక్కడకు బయలుదేరుతున్నట్లు భావించవచ్చు.

ఇటీవలే హైదరాబాద్‌లో నిరాడంబరంగా ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా చేశారు. షూటింగ్‌లో ఎటువంటి అవాంతరాలు రాకుండా హైదరాబాద్‌ లేదా విజయవాడలో ఓ చిన్న సన్నివేశం ఘాట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి ప్రియాంక చొప్రా నటిస్తున్నారు.