తండేల్ నుంచి హైలెస్సో ... హైలెస్సా..

చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ‘తండేల్’ ఫిబ్రవరి 7 న విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్‌ డేట్ దగ్గర పడుతున్నందున ఒక్కో పాట రిలీజ్‌ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి హైలెస్సో ... హైలెస్సా.. అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ విడుదల చేశారు. శ్రీమణి వ్రాసిన ఈ పాటని దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచి సంగీతం అందించగా  నకాశ్ అజీజ్, శ్రేయ ఘోషాల్ పాడారు. 

నాగ చైతన్యకు 23వ సినిమాగా వస్తున్న తండేల్‌కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు కధ: కార్తీక్ తీడ, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: శాందత్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. 

తండెల్ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, బన్నీ వ్యాస్ కలిసి తెలుగు, తమిళ్, హిందీ  భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది.