నాగ్ కుబేరుడు... బిచ్చగాడి పాత్రలో ధనుష్?

శేఖర్ కమ్ముల సినిమా అంటేనే డిఫరెంట్. ఆయన సినిమాల కోసం అభిమానులు ఎప్పుడూ ఎదురుచూస్తూనే ఉంటారు. ఆయన దర్శకత్వంలో నాగార్జున, కోలీవుడ్‌ నటుడు ధనుష్, రష్మిక మందన ప్రధాన పాత్రలలో సిద్దమవుతున్న సినిమా కుబేర. ఈ సినిమాలో ధనుష్ బిచ్చగాడి పాత్ర చేస్తున్నట్లు దర్శకుడు శేఖర్ కమ్ముల స్వయంగా చెప్పారు. 

ఈ పాత్రకి ధనుష్‌ని తీసుకుందామని నేను అనుకున్నప్పుడు, ఆయనకు చెపితే ఎలా రియాక్ట్ అవుతారో?అసలు నేను ఎవరో ఆయనకు తెలుసో తెలీదో?అని సందేహిస్తూనే ఫోన్ చేశాను. నేను ఫలానా అని చెప్పగానే ఆయన నా సినిమాలు, వాటిలో తనకు నచ్చిన సన్నివేశాల గురించి మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషం కలిగింది. 

అయినా నేను బిచ్చగాడి పాత్ర చేయాలని ఆయనకు చెప్పడానికి సంకోచిస్తూనే ఉన్నను. ఆయనే ఆడగడంతో చెప్పాను. 

అందుకు ఆయన ‘మీ దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేస్తే చాలనుకున్నాను. ఇన్నేళ్ళకు నాకీ అవకాశం లభించింది. ఏ పాత్ర అయినా నాకు ఒకే అంటూ చెప్పేసారికి ఆయనపై నాకు చాలా గౌరవం కలిగింది. సినిమా షూటింగ్‌ సమయంలో ఆయన నిబద్దత చూసినప్పుడు మరింత గౌరవం పెరిగింది,” అని శేఖర్ కమ్ముల అన్నారు. 

ఆ సమయంలో రష్మిక మందన కూడా యానిమల్ డబ్బింగ్ కోసం ముంబయికి, పుష్ప-2 కోసం హైదరాబాద్‌కి మద్య తిరుగుతూనే ఉన్నారు. ఆమె అంత బిజీగా ఉన్నా నేను కధ చెప్పగానే ఒకే అన్నారు. వీలుచేసుకొని షూటింగ్‌కి కూడా వచ్చేశారు. అంత బిజీగా గడుపుతున్నా చాలా హుషారుగా ఉండేవారు,” అని శేఖర్ కమ్ముల చెప్పారు.