నాగశౌర్య టైటిల్‌, ఫస్ట్-లుక్‌ రేపు ఉదయం

నాగశౌర్య ప్రధాన పాత్రలో రామ్ దేశిన దర్శకత్వంలో కొత్త సినిమా మొదలుపెట్టాడు. కొత్తగా సినీ నిర్మాణ రంగంలోకి వచ్చిన వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నంబర్:1గా దీనిని తెరకెక్కించబోతున్నారు.

ఈ సినిమా ఫస్ట్-లుక్‌, టైటిల్‌ బుధవారం ఉదయం 10.08 గంటలకు వెల్లడిస్తామని తెలియజేస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు. వైజాగ్ బీచ్‌ ఒడ్డున  తెన్నేటి పార్క్ వద్దకు సముద్రంలో కొట్టుకువచ్చిన బాంగ్లాదేశ్ షిప్ పక్కన నిలబడి సముద్రం వైపు చూస్తున్న హీరో ఫోటోని పోస్టర్లో వేశారు. 

ఈ సినిమాకి కధ దర్శకత్వం:  రామ్ దేశిన (రమేష్), సంగీతం: హ్యారీస్ జయరాజ్, కెమెరా: రసూల్ ఎల్లోర్, ఆర్ట్: రామాంజనేయులు, స్టంట్స్: సుప్రీం సుందర పృధ్వీ, కొరియోగ్రఫీ: రాజు సుందరం మాస్టర్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు. ఈ సినిమాకి నిర్మాతలు: శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్‌ చింతలపూడి, డా. అశోక్ కుమార్‌ చింతలపూడి. 

త్వరలోనే ఈ సినిమా హీరోయిన్‌, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటిస్తామని నిర్మాత శ్రీనివాసరావు చింతలపూడి తెలిపారు.