
మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ముగ్గురూ కలిసి నటించిన భైరవం సినిమా టీజర్ విడుదలైంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఆనంది, అదితి శంకర్, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటించారు. జయసుధ, అజయ్, రాజా రవీంద్ర, సంపత్ రాజ్, సనీడప రాజ్, వెన్నెల కిషోర్, శరత్ లోహితస్వ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకి దర్శకత్వం, స్క్రీన్ ప్లే: విజయ్ కనకమేడల, కెమెరా: హరి కే వేదాంతం, డైలాగ్స్: సత్యశ్రీ, తూం వెంకట్, పాటలు: భాస్కరభట్ల, కాశర్ల శ్యామ్, చైతన్య ప్రసాద్, బాలాజీ, తిరుపతి జావన, సంగీతం: శ్రీచరణ్ పాకాల, స్టంట్స్: రామకృష్ణన్, నటరాజ మాదిగొండ, ఎడిటింగ్: చోట కే ప్రసాద్ చేస్తున్నారు.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకే రాధామోహన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోందని ప్రకటించారు. సినిమా పేరు భైరవం కనుక ఫిబ్రవరి 26 న శివరాత్రికి విడుదల చేస్తారేమో?